Pawan Kalyan: ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం అనిరుధ్ స్టెప్పులతో మ్యూజిక్ వీడియో!

  • 'గాలి వాలుగా' పాట‌కు సంగీత ద‌ర్శ‌కుడి స్టెప్పులు
  • ఆక‌ట్టుకుంటున్న వీడియో
  • పొగిడేస్తున్న నెటిజ‌న్లు

ప‌వ‌ర్ స్టార్‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ మీద అభిమానాన్ని సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద‌ర్ ఓ మ్యూజిక్ వీడియో ద్వారా బ‌య‌ట‌పెట్టాడు. 'ఎ ట్రిబ్యూట్ టు ప‌వ‌ర్‌స్టార్‌' అంటూ 'అజ్ఞాత‌వాసి' చిత్రంలోని 'గాలి వాలుగా..' పాట‌కు స్టెప్పులు వేసి వీడియో రూపొందించాడు.

ఈ వీడియోలో అనిరుధ్ పాట‌ను పాడుతూ, డ్యాన్స్ చేయడం చూడొచ్చు. ఈ వీడియో అభిమానుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. అనిరుధ్ చేసిన ఈ వీడియోను నెటిజ‌న్లు తెగ పొగిడేస్తున్నారు.

More Telugu News