విశాల్ పోటీ చేయడం తప్పెలా అవుతుంది?.. ప్రశ్నించిన నటుడు శరత్ కుమార్
- తన పేరుతో రూపొందించిన యాప్‌ను విడుదల చేసిన శరత్ కుమార్
- విశాల్ నామినేషన్ తిరస్కరణను పెద్దది చేయొద్దని సూచన
- నటీనటుల సంఘంలో ఐక్యత లోపించిందన్న సీనియర్ నటుడు
విశాల్ నామినేషన్ తిరస్కరణకు గురైన విషయాన్ని పెద్దది చేయడం సరికాదన్నారు. ఇదేమీ పెద్ద సమస్య కాదన్నారు. ఎంజీఆర్ నామినేషన్ కూడా తిరస్కరణకు గురైన సందర్భాలు ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నటీనటుల సంఘంలో ఐక్యత లోపించిందన్న శరత్ కుమార్, సమస్యల పరిష్కారానికి అందరూ ఏకతాటిపైకి వచ్చి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాధిక, ఆమె కుమార్తె రయాన్, నటి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.