ఎవరు చెప్పినా వినను .. నాకు నచ్చిందే చేస్తాను: యాంకర్ రవి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎవరు చెప్పినా వినను .. నాకు నచ్చిందే చేస్తాను: యాంకర్ రవి

  • మొదటి నుంచి హీరో కావాలని ఉండేది 
  • అటు వైపు వెళ్లడం కోసమే యాంకర్ గా మారాను 
  • చిన్న సినిమాల్లో హీరోగా చేయాలని నిర్ణయించుకున్నాను
  • నటన తప్ప నాకు మరేమీ తెలియదు    
బుల్లితెరపై సందడి చేస్తోన్న యాంకర్ గా రవికి యూత్ లో మంచి క్రేజ్ వుంది. ఈ క్రేజ్ ఆయనను తెలుగు తెరపై హీరోను చేసింది. ఆయన హీరోగా చేసిన 'ఇది మా ప్రేమకథ' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడాడు. "మొదటి నుంచి కూడా నాకు సినిమాల్లో హీరో కావాలని ఉండేది. డైరెక్టుగా సినిమాల్లోకి వెళ్లే పరిస్థితి లేకపోవడం వలన, యాంకర్ గా మారాను. యాంకర్ గా పేరు వచ్చాక పెద్ద సినిమాల్లో కొడుకుగా .. తమ్ముడిగా .. ఫ్రెండ్ గా అవకాశాలు వచ్చాయి"

" ఆ పాత్రలు అంగీకరిస్తే అలాంటివే వస్తుంటాయి కనుక .. చేయదలచుకోలేదు. చిన్న సినిమాల్లో హీరోగానే చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ ప్రయాణంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలని భావిస్తున్నాను. నాపై నాకు నమ్మకం ఎక్కువ .. ఎవరు చెప్పినా వినిపించుకోను .. నాకు ఏది నచ్చితే అదే చేస్తాను. ఒకవేళ పొరపాట్లు జరిగితే వాటిని సరిచేసుకుంటూ ముందుకు సాగుతాను. ఎన్ని కష్టాలు పడినా .. ఎవరెంతగా విమర్శించినా నాకు తెలిసింది ఇదే .. అందువలన ఇదే మార్గంలో కొనసాగుతాను" అంటూ చెప్పుకొచ్చాడు.       
ravi

More Telugu News