‘పోలవరం’: ‘పోలవరం’ పనులు శరవేగంగా చేసేందుకు తగు నిర్ణయాలు: మంత్రి దేవినేని

  • డ్యాం పనుల్లో నాణ్యత లేదనేది అవాస్తవం
  • రాత్రింబవళ్లు ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి
  • ఓ ఇంటర్వ్యూలో దేవినేని

పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా చేయడానికే తగు నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్లబోతున్నామని ఏపీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, పనులు వేగవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కెల్లర్ జర్మనీ సంస్థ లోయర్ కాపర్ డ్యాం పనులను వాళ్లకు కేటాయించిన సమయం కన్నా ముందే చేశారని చెప్పారు. అంతేకాకుండా, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన నిపుణులు డ్యాం సైట్ లో ఉండి రాత్రింబవళ్లు పనులను పరిగెత్తిస్తున్నారని అన్నారు.

ప్రాజెక్టు పనుల్లో నాణ్యత లేదని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు కొందరు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యుల పర్యవేక్షణలో ఈ డ్యాం నిర్మాణం జరుగుతోందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నాయని స్పష్టం చేశారు.

డ్యాం సైట్ లో ఏడు గ్రామాలు ఉన్నాయని, 2004-2014 మధ్య ముగ్గురు ముఖ్యమంత్రులు ఈ గ్రామాల నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి ఆ గ్రామాలను ఖాళీ చేయించలేకపోయారని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గ్రామస్తులకు నష్టపరిహారం చెల్లించడం జరిగిందని అన్నారు.

More Telugu News