america: పాకిస్థాన్ కు వెళ్లకండి: తమ పౌరులను హెచ్చరించిన అమెరికా

  • పాకిస్థాన్ లో పరిస్థితి బాగోలేదు
  • ఉగ్రదాడులు జరిగే అవకాశం
  • అత్యవసరం అయితే తప్ప ఆ దేశం వెళ్లవద్దు

తమ పౌరులకు అమెరికా మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్థాన్ కు వెళ్లాలనుకుంటున్నవారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ఆ దేశానికి వెళ్లరాదంటూ సూచించింది. పాక్ లో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవని... ఉగ్ర ముప్పు పొంచి ఉందని తెలిపింది. స్థానిక, విదేశీ ఉగ్రవాద సంస్థల నుంచి అమెరికా ప్రజలకు అడుగడుగునా ముప్పు ఉందని పేర్కొంది.

 గతంలో కూడా అమెరికా దౌత్యవేత్తలు, అధికారులపై దాడులు జరిగాయని... అవి మళ్లీ జరిగే అవకాశం ఉందని చెప్పింది. పాక్ లో ఆత్మాహుతి దాడులు పెరిగిపోయాయని తెలిపింది. ప్రభుత్వ, ప్రభుత్వేతర, న్యాయ సిబ్బంది, గిరిజనులు, మానవతావాదులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులు జరుగుతున్నాయని చెప్పింది. ఈ నేపథ్యంలో, ఆ దేశానికి వెళ్లే అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు, తమది ఉగ్రవాద దేశం కాదని పాకిస్థాన్ వాదిస్తోంది. 

More Telugu News