sarah app: త్వ‌ర‌లో భార‌తీయ భాష‌ల్లో సారాహ్ యాప్‌... వెల్ల‌డించిన వ్య‌వ‌స్థాప‌కుడు తాఫీఖ్‌

  • మ‌రిన్ని కొత్త ఫీచ‌ర్లు కూడా
  • భార‌తీయ మార్కెట్ మీదే ప్ర‌ధాన దృష్టి
  • పెరుగుతున్న స‌బ్‌స్క్రైబ‌ర్లు

కొన్ని నెల‌ల క్రితం ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారిన సారాహ్ యాప్ గుర్తుంది క‌దా! ఈ యాప్ ద్వారా ఇత‌రులు మ‌న గురించి ఏమ‌నుకుంటున్నారో తెలుసుకోవ‌చ్చు. యాప్ డౌన్‌లోడ్ చేసుకోగానే ఒక లింక్ వ‌స్తుంది. దాన్ని సోష‌ల్ మీడియాలో గానీ, గ్రూపుల్లో గానీ షేర్ చేయాలి. అప్పుడు ఎవ‌రైనా మీకు ఏదైనా స‌రాస‌రి చెప్ప‌లేని విష‌యాల‌ని ఆ లింక్ ద్వారా చెప్ప‌వ‌చ్చు. ఎవ‌రో చెప్పారో తెలియ‌దు కానీ వారు చెప్పాల‌నుకున్న విష‌యం మాత్రం తెలుస్తుంది. వినియోగ‌దారుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవ‌డానికి చాలా కంపెనీలు ఈ యాప్‌ను ఉప‌యోగిస్తున్నాయి.

అయితే త్వ‌ర‌లో ఈ యాప్‌ను భార‌తీయ భాష‌ల్లో కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు యాప్‌ వ్య‌వ‌స్థాప‌కుడు జైన్ అలాబ్దిన్ తాఫీఖ్ తెలిపారు. అంతేకాకుండా వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి మ‌రిన్ని కొత్త ఫీచ‌ర్ల‌ను కూడా ప్ర‌వేశ‌పెడుతున్నట్లు ఆయ‌న చెప్పారు. ప్ర‌స్తుతం 270 మిలియ‌న్ల‌ మందికి పైగా త‌మ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నార‌ని, మార్కెట్‌ను పెంచుకోవ‌డానికి భార‌త్ మీదే ప్ర‌ధానంగా దృష్టి సారించామని తెలిపారు. అంతేకాకుండా నెట్‌ఫ్లిక్స్‌, హ్యూస్ట‌న్ ప్రెస్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగులు, వినియోగ‌దారుల నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు పొందడానికి త‌మ యాప్‌ను ఉప‌యోగిస్తున్నార‌ని తారిఖ్ వెల్ల‌డించారు.

More Telugu News