India: జెరూసలెంను ఇజ్రాయెల్‌ రాజధానిగా అమెరికా గుర్తించడంపై భారత్‌ స్పందన!

  • పాలస్తీనా విషయంలో మేము తీసుకునే నిర్ణయాలు స్వతంత్రంగా ఉంటాయి
  • మా అభిప్రాయాలు, ఆసక్తులకు అనుగుణంగానే నిర్ణ‌యాలు
  • దీన్ని ఏ మూడో దేశం నిర్ణయించబోదు

పాలస్తీనా విషయంలో తాము తీసుకునే నిర్ణయాలు స్వతంత్రంగా, స్థిరంగా ఉంటాయని భార‌త్ స్ప‌ష్టం చేసింది. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. జెరూసలెంను ఇజ్రాయెల్‌ రాజధానిగా అధికారికంగా గుర్తించడంపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్ భార‌త్ త‌ర‌ఫున ప్ర‌క‌ట‌న చేశారు. భార‌త్ త‌న‌ అభిప్రాయాలు, ఆసక్తులకు అనుగుణంగానే ఉంటుంద‌ని, దీన్ని ఏ మూడో దేశం నిర్ణయించబోదని తేల్చి చెప్పారు.

కాగా, అమెరికా చేసిన ప్ర‌క‌ట‌న‌ను అర‌బ్ దేశాలు వ్య‌తిరేకిస్తున్నాయి. మ‌రోవైపు టెల్‌ అవివ్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలెంకు తరలించేందుకు అమెరికా ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. ట్రంప్ తీసుకున్న నిర్ణ‌యం ఆందోళ‌న‌ల‌ను మ‌రింత పెంచేదిగా ఉంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.    

More Telugu News