irrevocable divorce: ట్రిపుల్ తలాక్ పై ముసాయిదా బిల్లు సిద్ధం.. ఓకే చెప్పిన ఉత్తరప్రదేశ్!

  • ట్రిపుల్ తలాక్ కు కేంద్రం చెక్
  • ముసాయిదా బిల్లును అంగీకరించిన తొలి రాష్ట్రంగా యూపీ
  • ఈ నేరానికి మూడేళ్ల జైలుశిక్ష .. మనోవర్తి ఇచ్చుకోవాలి 

'ట్రిపుల్ తలాక్', 'తలాక్-ఇ-బిద్దత్, తలాయ్-ఇ-ముఘల్లజ్, ఇస్లామిక్ డైవోర్స్ లేదా ఇర్రివర్సబుల్ డైవోర్స్.. ఇలా వివిధ పేర్లతో పిలిచే ముస్లిం సంప్రదాయ విడాకుల విధానానికి కేంద్ర ప్రభుత్వం చెక్ చెప్పనుంది. ముస్లిం సంప్రదాయంలో భాగమై, మహిళల వేదనకు కారణమవుతున్న 'ట్రిపుల్‌ తలాక్‌' చట్టసంస్కరణకు కేంద్రం పూనుకున్న సంగతి తెలిసిందే. సుదీర్ఘ కాలంగా ట్రిపుల్ తలాక్ పధ్ధతి ముస్లిం మహిళలను తీవ్ర ఇబ్బందుల పాలుచేస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ సంప్రదాయాన్ని సంస్కరిస్తామని 2014 ఎన్నికల్లో మోదీ హామీ ఇచ్చారు. ఆమధ్య ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ కూడా అదే హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ తలాక్ సంప్రదాయాన్ని సంస్కరిస్తూ, ట్రిపుల్ తలాక్ ను నేరంగా పరిగణించేందుకు కేంద్ర ప్రభుత్వం ముసాయిదా బిల్లును రూపొందించింది. ఈ బిల్లుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మద్దతు పలికింది. దీంతో ఈ బిల్లుకు మద్దతు తెలిపిన తొలి రాష్ట్రంగా యూపీ నిలిచింది. ‘తలాక్‌’ చెప్పిన వ్యక్తికి మూడేళ్ల జైలుశిక్షతో పాటు భార్య, మైనారిటీ తీరని చిన్నారుల పోషణకు మనోవర్తి ఇవ్వాలని ఈ బిల్లు పేర్కొంటోంది. 

More Telugu News