akkineni: వీడియో విడుద‌ల చేసి.. కుమారుడికి సారీ చెప్పిన అక్కినేని నాగార్జున‌.. చీటింగ్ చేశావ‌న్న అఖిల్‌!

  • అఖిల్ కొత్త సినిమాలోని పాట విజువ‌ల్స్‌ను విడుద‌ల చేసిన నాగ్‌
  • విడుద‌ల చేయ‌కుండా ఉండ‌లేక‌పోతున్నానంటూ ట్వీట్‌
  • ఏదేమైనా ప్ర‌తి ఒక్క‌రూ ఈ వీడియోను ఇష్ట‌ప‌డ‌తారని చెప్పిన అఖిల్‌

'సారీ రా అఖిల్.. ఈ సాంగ్‌ విజువ‌ల్స్ విడుద‌ల చేయ‌కుండా ఉండ‌లేక‌పోతున్నా, నువ్వు ఇంకా ఫాస్ట్ కావాల్సి ఉంది' అంటూ అఖిల్ కొత్త సినిమా 'హ‌లో'లోని ఓ పాట‌కు సంబంధించిన విజువ‌ల్స్‌ను విడుద‌ల చేశారు అక్కినేని నాగార్జున‌. ఈ సినిమాలో ఇంట్లో జ‌రుగుతోన్న ఓ వేడుక సంద‌ర్భంగా ఈ పాట‌ను పాడుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో అఖిల్ డ్యాన్స్ తో అద‌ర‌గొట్టేశాడు. ఒక నిమిషం 18 సెక‌న్‌ల పాటు ఉన్న‌ ఈ వీడియోపై స్పందించిన అఖిల్.. 'హాహాహాహా.. ఏమిటీ చీటింగ్‌? ఏదేమైనా ప్ర‌తి ఒక్క‌రూ ఈ వీడియోను ఇష్ట‌ప‌డ‌తారు' అని పేర్కొన్నాడు. వీరి సంభాష‌ణ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది.. ఈ వీడియో మీరూ చూడండి.. 

  • Loading...

More Telugu News