చంద్రుని మీద రోబో స్టేషన్ ఏర్పాటు చేసేందుకు యత్నిస్తున్న చైనా
- అక్కడి భౌగోళిక పరిస్థితుల అధ్యయనం
- సోలార్ పవర్ జనరేటర్ ఏర్పాటుకు యత్నం
- 2030లోగా మొదటి పేలోడ్ ప్రయోగం
ఒక సోలార్ పవర్ జనరేటర్‌ను అక్కడ ఏర్పాటు చేస్తే, రోవర్లు అవసరం లేకుండానే చంద్రుని భౌగోళిక పరిస్థితులను క్షుణ్నంగా అధ్యయనం చేసే అవకాశం కలగనుంది. ఈ ప్రయోగానికి సంబంధించి మొదటి క్యారియర్ రాకెట్‌ను 2030లోగా పంపేందుకు చైనా యోచిస్తోంది. అలాగే 2018లో `చాంగ్‌ఏ-4` పేరిట చంద్రుని మీది చీకటి భాగాన్ని పరిశోధించేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోంది.