Adhaar: హర్రీ అప్! ఈ ఆరింటికీ సమీపిస్తున్న గడువు.. ఆధార్ లింక్ చేసుకోకుంటే అంతే!

  • ఈనెల 31తో ముగియనున్న గడువు
  • సుప్రీం ఓకే అంటే పాన్ ‌కార్డుకు మాత్రం గడువు పొడిగించే అవకాశం
  • తొందరపడకుంటే సేవలు ఆగిపోయే ప్రమాదం

మరో మూడు వారాలే గడువు. ఈలోగా తొందరపడకుంటే కొన్ని పథకాలతోపాటు, మరికొన్ని సేవలతో మీకు లింక్ తెగిపోయే అవకాశం ఉంది. వివిధ సేవలకు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేసిన ప్రభుత్వం వాటిలో కొన్నింటికి ఈ నెల 31 చివరి తేదీగా ప్రకటించింది. వాటిలో బ్యాంకు ఖాతాలు, పాన్‌కార్డులు, మ్యూచువల్ ఫండ్స్, బీమా పాలసీలు, పోస్టాఫీసు పథకాలు ఉన్నాయి. ఈ నెలాఖరులోగా వీటికి ఆధార్ అనుసంధానం చేసుకోవాలి. మొబైల్ నంబరుకు ఆధార్ అనుసంధానం గడువు మాత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 6వ తేదీ వరకు ఉంది. కాబట్టి తొందరపడి ఆధార్ అనుసంధానం చేయకపోతే ఆ సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది.

ఆధార్‌ను తప్పనిసరి చేయడానికి సుప్రీంకోర్టు అనుమతిస్తే పాన్‌కార్డుతో లింకింగ్ గడువును పెంచే అవకాశం మాత్రం ఉందని అధికారులు చెబుతున్నారు. అదే జరిగితే గరిష్టంగా ఆరు నెలలు గడువు పెంచే అవకాశం ఉంది. నవంబరు నెలాఖరు వరకు 33 కోట్ల మంది పాన్‌కార్డు వినియోగదారుల్లో 13.28 కోట్ల మంది మాత్రమే ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారు.

More Telugu News