sai pallavi: సారీ .. నేను చేయలేనంటూ దిల్ రాజుతో చెప్పేసిన సాయిపల్లవి!

షార్ట్స్‌లో చూడండి
'ఫిదా' సినిమాతో విజయాన్నే కాదు .. విపరీతమైన క్రేజ్ ను సాయిపల్లవి సొంతం చేసుకుంది. ఈ సినిమా తరువాత ఆమెకు ఒక్కసారిగా అవకాశాలు వచ్చిపడినప్పటికీ, తరువాత సినిమాను కూడా దిల్ రాజు నిర్మాణంలో చేయడానికే మొగ్గు చూపింది. ఫలితంగా 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమా తెరకెక్కింది. ఈ నెల 21వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో దిల్ రాజు .. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో 'శ్రీనివాస కల్యాణం' సినిమా చేయడానికి రంగాన్ని సిద్ధం చేశారు. ఈ కథకి హీరోగా నితిన్ ను ఎంపిక చేసుకున్న ఆయన, కథానాయికగా మళ్లీ సాయిపల్లవినే అడిగారట. కథ విన్న సాయిపల్లవి .. తన పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదంటూ పెదవి విరిచిందని సమాచారం. నటనకి స్కోప్ లేని ఈ పాత్రను తాను చేయలేనంటూ సారీ చెప్పేసిందట. పాత్రల ఎంపిక విషయంలో సాయిపల్లవి ఎంత జాగ్రత్తగా ఉంటుందనేది ఈ విషయం స్పష్టం చేసింది. సాయిపల్లవి నో చెప్పేసిన తరువాతనే ఆ పాత్రకి గాను పూజా హెగ్డేను తీసుకున్నారట.
Go Back to Shorts
sai pallavi
Dil Raju

More Telugu News