దీపిక పదుకునేని చంపుతామని హెచ్చరికలు చేయడం భయంకరమైనది: షాహిద్ కపూర్
- రాజ్‌పుత్‌ల హెచ్చరికలపై స్పందించిన షాహిద్
- చంపుతామని చెప్పడంతో షాక్‌కు గురయ్యా
- సినిమా చూడకముందే ఇటువంటి నిర్ణయాలా?
- ఈ మూవీని చూసిన తర్వాతే మాట్లాడాలి
ఇలా హెచ్చరికలు చేయడం భయంకరమైనదని, తాను ఇటువంటి బెదిరింపులను ఊహించలేదని వ్యాఖ్యానించారు. దీపిక పదుకునేకి హాని తలపెడతామని చాలా మంది అంటున్నారని, అసలు ఈ సినిమా చూడకముందే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. పద్మావతి సినిమా చూసిన తర్వాతే దానిపై మాట్లాడాలని తాను మొదటి నుంచి చెబుతున్నానని చెప్పారు. ఈ సినిమాను నిజ జీవిత సంఘటన ఆధారంగా తీయలేదని చెప్పుకొచ్చారు.