rahul gandhi: కాంగ్రెస్ దారులన్నీ ఢిల్లీకే... రాహుల్ పట్టాభిషేకానికి ముహూర్తం?

  • ఏఐసీసీ చీఫ్ పదవికి నామినేషన్ రేపే
  • రేపు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ వేయనున్న రాహుల్
  • ప్రత్యర్థులు లేకపోవడంతో రాహుల్ ఎన్నిక ఏకగ్రీవం
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా ఢిల్లీకి క్యూ కడుతున్నారు. ఏఐసీసీ చీఫ్ గా రాహుల్ గాంధీకి పట్టాభిషేకం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఏఐసీసీ చీఫ్ పదవికి రేపు సాయంత్రం 3 గంటలకు రాహుల్ గాందీ నామినేషన్ వేయనున్నారు. అయితే ఆయనకు పోటీగా ఎవరూ నామినేషన్ వేసే అవకాశాలు లేకపోవడంతో ఆయన అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

 ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు ఢిల్లీకి బయల్దేరుతున్నారు. కాగా, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ 4వ తేదీని దాఖలు చేయాలి. ఈనెల 17న పోలింగ్ జరుగుతుంది, 19న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అయితే నామినేషన్లు దాఖలు కాకపోవడంతో పోలింగ్, కౌంటింగ్ సమస్య ఉండదని, దీంతో ముందుగానే రాహుల్ పట్టాభిషేకం ఉంటుందని తెలుస్తోంది.
rahul gandhi
AICC
aicc chief
election

More Telugu News