sancha ilayya: ఖమ్మలో కంచ ఐలయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • ఖమ్మంలో గొల్ల కురుమ సభ
  • ఐలయ్యను అడ్డుకున్న పోలీసులు
  • అరెస్టు, నిరసన
ఖమ్మం జిల్లాలో ప్రొఫెసర్ కంచ ఐలయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీపీఎం, గొల్ల కురుమ సంఘం ఆధ్వర్యంలో ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సభకు అనుమతినివ్వలేదని పోలీసులు తెలిపారు. అయితే బహిరంగ సభ నిర్వహించడం ద్వారా ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి? అని ఆ సంఘం నాయకులు ప్రశ్నించారు. సభ నిర్వహించి తీరుతామని వారు ప్రకటించారు.

ఈ నేపథ్యంలో సభకు హాజరయ్యేందుకు కంచ ఐలయ్య అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై ఐలయ్య మాట్లాడుతూ, గొల్లకురుమలకు అన్యాయం చేసే విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. తాను సీఎం కేసీఆర్‌ రాజకీయ ప్రత్యర్థిని కానని అన్నారు. అలాంటి తనను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన తెలిపారు. తాను తెలంగాణ వ్యక్తిని కాకపోతే అరెస్టు చేసినా అర్థం ఉండేదని ఆయన తెలిపారు. 
sancha ilayya
khammam
gollakurama sabha

More Telugu News