బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ కు నెటిజన్ల విమర్శలు!
- విద్యాబాలన్, పరిణీతి చోప్రాకు మద్దతుగా నిలిచిన శ్రద్ధా కపూర్
- మార్లిన్ మన్రో స్లిమ్ గా లేకున్నా శృంగార దేవతగా నీరాజనాలందుకుంది
- అలాంటప్పుడు లిప్టన్ గ్రీన్ టీ ఎందుకు తాగమంటున్నావు?
ఈ నేపథ్యంలో విమర్శలు రావడంతో ఆమెకు మద్దతుగా శ్రద్ధా కపూర్ అలనాటి హాలీవుడ్ స్టార్ హీరోయిన్ మార్లిన్ మన్రో ఫోటోను పోస్టు చేస్తూ... 'ఆమె పొట్టటోన్డ్ కాదని, ఆ శరీరం బిగుతుగా ఉండదని, అయినా ఆమె ప్రపంచవ్యాప్తంగా అభిమానుల ఆదరణతో పాటు శృంగార దేవతగా నీరాజనాలు అందుకుందని గుర్తు చేస్తూ...శరీర సౌష్టవం అనేది వ్యక్తిగత ఇష్టాలను బట్టి ఉంటుంద'ని తెలుపుతూ ఫోటో పోస్టు చేసింది.
దీనిపై నెటిజన్లు విమర్శలు కురిపించారు. ఎవరి శరీరం వారి ఇష్టమైనప్పుడు...'స్లిమ్ గా ఉండండి.. స్లిమ్ గా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. రోజూ గ్రీన్ టీ తాగండి అని ఎందుకు చెబుతున్నావు? డబ్బు కోసం ఎంతకైనా దిగజారతావా?..హిపోక్రైట్' అంటూ నిలదీస్తున్నారు. కాగా, లిప్టన్ గ్రీన్ టీ యాడ్ లో శ్రద్ధాకపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.