Ramcharan: రాజమౌళి సినిమాలో రాంచరణ్ హీరో అయితే, ఎన్టీఆర్ ది విలన్ పాత్రట!

  • రాజమౌళి తరువాతి చిత్రంలో రాంచరణ్, ఎన్టీఆర్
  • ఎన్టీఆర్ పాత్రకు నెగటివ్ షేడ్స్
  • టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న లేటెస్ట్ న్యూస్!

అతి త్వరలో పట్టాలెక్కుతుందని టాలీవుడ్ సినీ వర్గాలు భావిస్తున్న రాజమౌళి తరువాతి చిత్రంలో మెగా పవర్ స్టార్ రాంచర్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఏ న్యూస్ లేదా గాసిప్ బయటకు వచ్చినా, అది వెంటనే వైరల్ అయిపోతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో వార్త చక్కర్లు కొడుతోంది.

ఈ చిత్రంలో రాంచరణ్ హీరో కాగా, ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను ధరిస్తున్నారని, ఇద్దరి క్యారెక్టర్లూ సమానంగా ఉండేలా, ఏమాత్రం ఎక్కువ తక్కువలు లేకుండా రాజమౌళి తీర్చిదిద్దారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇద్దరూ బాక్సర్లుగా నటిస్తున్నారని ఇటీవలే ఓ వార్త వచ్చిన సంగతి తెలిసిందే. తన తాజా చిత్రం 'జై లవకుశ'లో ఎన్టీఆర్ ఓ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను కూడా పోషించి రక్తి కట్టించిన సంగతి తెలిసిందే. తన సినిమాల్లో నెగటివ్ క్యారెక్టర్లను హీరోలతో సమానంగా తీర్చిదిద్దే రాజమౌళి, ఈ చిత్రంలో ఎన్టీఆర్ ను ఎలా చూపిస్తారో మరి. దీనిపై అధికారిక సమాచారం మాత్రం ఏదీ ఇంకా బయటకు రాలేదు.

More Telugu News