Donald Trump: విదేశాంగ మంత్రితో విభేదిస్తా... అయితే అతనిని తొలగించడం లేదు!: ట్రంప్ ప్రకటన

  • రెక్స్ టిల్లర్ సన్ తొలగింపు వార్తలపై ట్రంప్ స్పందన
  • మీడియా ఫేక్ న్యూస్ ప్రసారం చేస్తోంది
  • విభేదించినా కలిసే పనిచేస్తాం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఆ దేశంలోని కొన్ని మీడియా సంస్థలతో విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. మీడియా సంస్థలు పలు సందర్భాల్లో ప్రసారం చేసిన వార్తలను ట్రంప్ ఫేక్ న్యూస్ అంటూ చిందులు తొక్కారు కూడా. తాజాగా మరోసారి మీడియా సంస్థలపై ఆయన మండిపడ్డారు. విదేశాంగ శాఖ మంత్రి రెక్స్‌ టిల్లర్‌ సన్‌ ను ట్రంప్ పదవి నుంచి తొలగించనున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి.

 ట్రంప్‌ కు, టిల్లర్‌ సన్‌ కు విభేదాలు తారస్థాయికి చేరాయని, ఈ నేపథ్యంలో ఆయనకు శ్వేత సౌధం నుంచి ఉద్వాసన తప్పదని మీడియా పేర్కొంటోంది. దీనిపై ట్వీట్ చేసిన ట్రంప్.. అదంతా మీడియా ఫేక్‌ న్యూస్‌ అన్నారు. కొన్ని విషయాల్లో ఆయనతో విభేదిస్తా, కానీ అతడిని మాత్రం తొలగించడం లేదు. ఇద్దరం కలిసి పనిచేస్తాం అని ట్రంప్‌ స్పష్టం చేశారు.

కాగా, ట్రంప్ విదేశాంగ విధానంపై టిల్లర్ సన్ మండిపడ్డారు. ఉత్తరకొరియా, ఇరాన్, కొన్ని అరబ్బు దేశాలతో ట్రంప్ వైఖరి సరిగా లేదని, ట్రంప్ మూర్ఖుడని టిల్లర్ సన్ పేర్కొన్నారు కూడా. ఈ నేపథ్యంలోనే మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కాగా, టిల్లర్‌ సన్‌ డిసెంబర్ 4 నుంచి 8 వరకు యూరోపియన్‌ టూర్‌ కి వెళ్లనున్నారు. 

More Telugu News