ఒబామాకు పూనమ్ కౌర్ ప్రత్యేక బహుమతి
- ఒబామాను కలిసిన పూనమ్ కౌర్
- ఢిల్లీలో జరిగిన కార్యక్రమం సందర్భంగా కలయిక
- చేనేత వస్త్రాలు బహుమతిగా అందజేత
ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలుపుతూ.. "నా జీవితంలో అంత్యంత విలువైన క్షణాలు గడిపాను. నేనెవరికి గౌరవం ఇస్తానో, నేనెవరిని చూసి స్ఫూర్తి పొందుతానో ఆ వ్యక్తిని కలిశాను. నేను ప్రేమించే ఇద్దరు వ్యక్తులకు అందజేయమని చేనేత వస్త్రాలను ఆయనకు అందజేశాను" అని ట్వీట్ చేసింది.
కాగా, పూనమ్ కౌర్ ఆంధ్రప్రదేశ్ చేనేత ప్రచారకర్త బాధ్యతలు నిర్వర్తించనున్నారని ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే.