virat kohli: కొనసాగుతున్న కోహ్లీ జోరు.. మరో మైలురాయిని చేరుకున్న కెప్టెన్

  • టెస్టుల్లో 5వేల పరుగులు పూర్తి చేసుకున్న కోహ్లీ
  • ఈ ఘనత సాధించిన 11వ భారతీయుడిగా రికార్డు
  • భారీ స్కోరు దిశగా భారత్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో, ఎన్నో మైలు రాళ్లు అతని సొంతమవుతున్నాయి. ఢిల్లీలో శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో కోహ్లీ మరో ఘనత సాధించాడు. టెస్ట్ కెరీర్ లో 5వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. 63 మ్యాచ్ లలో కోహ్లీ ఈ ఘనతను సాధించాడు.  ఈ క్రమంలో 5వేల పరుగుల మైలు రాయిని అధిగమించిన 11వ భారతీయ క్రికెటర్ గా కోహ్లీ అవతరించాడు. ఈ ఘనతను సాధించి ఇతర బ్యాట్స్ మెన్లలో సచిన్, ద్రావిడ్, గవాస్కర్, లక్ష్మణ్, సెహ్వాగ్, గంగూలీ, వెంగ్ సర్కార్, అజారుద్దీన్, గుండప్ప విశ్వనాథ్, కపిల్ దేవ్ లు ఉన్నారు. ఈ క్రమంలో 15వ అర్ధ శతకాన్ని కూడా నమోదు చేశాడు.

మరోవైపు కోహ్లీ, మురళీ విజయ్ ల జోరుతో భారత్ భారీ స్కోరు దిశగా కదులుతోంది. మురళీ విజయ్ 61 పరుగులు, కోహ్లీ 51 పరుగులతో ఆడుతున్నారు. భారత్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 160 పరుగులు. 

More Telugu News