trailer: 15 ఏళ్లుగా ఓ అమ్మాయి కోసం ఎదురుచూస్తోన్న ప్రేమికుడిగా అఖిల్‌.. 'హ‌లో' థియేట్రిక‌ల్‌ ట్రైల‌ర్‌ విడుద‌ల!

  • నాగార్జున వాయిస్ ఓవర్‌తో మొద‌ల‌వుతోన్న ట్రైలర్‌
  • అవినాష్ పాత్ర‌లో అఖిల్‌
  • సింపుల్‌గా అంద‌రినీ ఆక‌ట్టుకునేలా డైలాగులు

యువ క‌థానాయ‌కుడు అక్కినేని అఖిల్ హీరోగా రూపుదిద్దుకుంటోన్న ‘హలో’ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ఈ రోజు విడ‌ద‌లైంది. 'మనం' దర్శకుడు విక్రమ్ కె.కుమార్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. నాగార్జున వాయిస్ ఓవర్‌తో ఈ ట్రైలర్‌ మొద‌లవుతోంది. 'హలో.. ఈ అబ్బాయ్ పేరు అవినాష్. ఒకప్పుడు ఇతడిని శ్రీను అని పిలిచేవారు' అంటూ హీరో పాత్రను పరిచయం చేశారు నాగార్జున‌.

ఈ సినిమాలో అఖిల్‌కు త‌ల్లిగా న‌టిస్తోన్న రమ్యకృష్ణ '15 ఏళ్లుగా ఒక అమ్మాయ్ కోసం ఎదురుచూస్తున్న నీకు పిచ్చిరా, మరిచిపోవాలిరా' అని డైలాగ్ కొట్టారు. జగపతిబాబు అఖిల్‌కి తండ్రిగా న‌టిస్తున్నారు. ఈ  సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్‌, మనం ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం వ‌హిస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 22న విడుద‌ల చేయ‌నున్నారు.   

More Telugu News