Jagan: కోర్టుకు రాలేకపోతున్నా... జగన్ పిటిషన్!

  • అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారమూ విచారణ
  • నేడు రాలేకపోతున్నట్టు పిటిషన్ దాఖలు
  • ఇటీవలి కాలంలో క్రమం తప్పకుండా విచారణకు హాజరు
  • కేసును వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
అక్రమాస్తుల కేసులో కోర్టు విచారణను ఎదుర్కొంటూ, ప్రతి శుక్రవారమూ కోర్టుకు హాజరవుతున్న వైకాపా అధినేత వైఎస్ జగన్ నేడు కోర్టుకు హాజరు కాలేదు. జగన్ పాదయాత్రలో ఉండటం, కొంత అనారోగ్యానికి గురికావడంతో ఆయన కోర్టుకు రాలేకపోతున్నారని జగన్ తరఫున న్యాయవాదులు నాంపల్లి సీబీఐ కోర్టు ముందు ఓ పిటిషన్ దాఖలు చేశారు.

దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు కేసు విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవలి కాలంలో కేసు విచారణకు క్రమం తప్పకుండా హాజరవుతున్నందునే ఈ పిటిషన్ కు కోర్టు ఓకే చెప్పినట్టు సమాచారం. కాగా, జగన్ పాదయాత్ర నేడు 23వ రోజుకు చేరుకుంది.
Jagan
padayatra
CBI Court

More Telugu News