Miss World: ఒకే విమానంలో మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్... మానుషి చేతిని ముద్దాడిన సుస్మితాసేన్ వీడియో!

  • మిస్ వరల్డ్ పోటీలకు ముందు విమానంలో కలుసుకున్న అందాల భామలు
  • మానుషికి అభినందనలు తెలిపిన సుస్మిత
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
ఇటీవలే మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్న అందాల భామ మానుషి చిల్లర్, ఆ కిరీటాన్ని పొందక ముందు విమానంలో వెళుతుండగా, 23 ఏళ్ల క్రితం మిస్ యూనివర్స్ టైటిల్ ను అందుకున్న సుస్మితా సేన్ అనుకోకుండా కలిసింది. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మానుషి మిస్ వరల్డ్ పోటీలకు సన్నాహకాల్లో ఉన్న విషయాన్ని తెలుసుకున్న సుస్మిత, ఆమెను ఆప్యాయంగా పలకరించి, తనవంతు సలహా సూచనలు ఇస్తూ, ఆమె చేతిని ముద్దాడింది. శాయశక్తులా టైటిల్ కోసం ప్రయత్నించాలని, విజయాన్ని దేవుడికి వదిలేయాలని అంటూ శుభాభినందనలు చెప్పింది.

1994లో మిస్ యూనివర్స్ ను సుస్మిత గెలుచుకున్న సంగతి తెలిసిందే. అదే ఏడాది ఐశ్వర్యా రాయ్ మిస్ వరల్డ్ గా నిలిచింది. ఆపై 2000లో ప్రియాంకా చోప్రా అదే టైటిల్ సాధించగా, 17 సంవత్సరాల తరువాత ఆ గౌరవాన్ని మానుషి దక్కించుకుంది. విమానంలో మానుషి, సుస్మితల వీడియోను మీరూ చూడవచ్చు.

Miss World
manudhi chillar
susmita sen
Miss Universe

More Telugu News