విజయ గర్వంతో కిమ్ జాంగ్ ఉన్ సంబరాలు!
- అతిపెద్ద ఖండాంతర క్షిపణిని పరీక్షించిన ఉ.కొరియా
- అత్యంత శక్తిమంతమైందని ఉ.కొరియా నిర్ధారణ
- 13,000 కిలో మీటర్ల లక్ష్యాన్ని సులువుగా ఛేదించగల హాసంగ్-15
తాజాగా పరీక్షించిన ఈ క్షిపణి వాషింగ్టన్ నగరాన్ని చేరి నాశనం చేయగలదని ఉత్తరకొరియా నిపుణులు నిర్ధారించారు. దీంతో కిమ్ జాంగ్ ఉన్ ఆనందంలో తేలియాడుతున్నారు. అత్యంత శక్తిమంతమైన క్షిపణిని తయారు చేశామని ఉత్తర కొరియా సైన్యం ప్రకటన చేసింది. ఈ క్షిపణి సుమారు 150 కేజీల బరువు ఉంటుందని, 13,000 కిలో మీటర్ల లక్ష్యాన్ని సులువుగా ఛేదించగలదని తెలిసింది.