south korea: నార్త్ కొరియాకు షాక్: నిమిషాల వ్యవధిలోనే దక్షిణ కొరియా క్షిపణి ప్రయోగం

  • ఉత్తర కొరియాకు దీటైన సమాధానాన్ని పంపిన దక్షిణ కొరియా
  • బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన దక్షిణ కొరియా
  • షింజో అబే, మూన్ జేఇన్ లతో మాట్లాడిన ట్రంప్

ఉత్తరకొరియా ఖండాంతర క్షిపణిని పరీక్షించినట్టు తెలియగానే, ఆ దేశానికి షాకిచ్చే నిర్ణయం తీసుకుంది దక్షిణ కొరియా. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం జరిగిన కొన్ని నిమిషాల్లోనే, తామేమీ తక్కువ కాదంటూ, అదే తరహా బాలిస్టిక్ మిసైల్ ను సౌత్ కొరియా పరీక్షించింది. కిమ్ జాంగ్ ఉన్ కు దీటైన సమాధానం చెప్పగలమన్న సంకేతాలను పంపేందుకే ఈ పని చేసినట్టు దక్షిణ కొరియా రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.

సియోల్‌ మీదుగా ఈ క్షిపణిని ప్రయోగించామని పేర్కొన్న దక్షిణ కొరియా, ఉత్తర కొరియా వైఖరి ప్రపంచ యుద్ధానికి దారితీసేలా ఉందని ఆరోపించింది. ఉత్తర కొరియాను ఉగ్రదేశంగా ప్రకటిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించిన గంటల వ్యవధిలోనే ఆ దేశం క్షిపణి ప్రయోగం చేసిన సంగతి తెలిసిందే. ఈ తాజా పరీక్షలపై ట్రంప్, జపాన్‌ ప్రధాని షింజో అబే, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జేఇన్‌ లతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

More Telugu News