KTR: కేటీఆర్... అమెరికాకు రండి: ఆహ్వానించిన ఇవాంకా ట్రంప్

  • కేటీఆర్ అనుసంధానకర్తగా 'వీ కెన్ డూ ఇట్'
  • ఐటీ అంటే ఇవాంకా ట్రంప్ అన్న కేటీఆర్
  • ఫిదా అయిన ట్రంప్ కుమార్తె
  • అమెరికాకు రావాలని ఆహ్వానం

గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా మారి, మహిళా దిగ్గజాల నడుమ కూర్చుని, ఓ అర్థవంతమైన చర్చాగోష్ఠిని విజయవంతంగా నిర్వహించిన కేటీఆర్ వాక్చాతుర్యానికి ఇవాంకా ట్రంప్ ఆకర్షితులయ్యారు. ఇవాంకా, చంద కొచ్చర్, చెర్రీ బ్లెయిర్, కరెన్ లతో 'వీ కెన్ డూ ఇట్' పేరిట చర్చ సాగగా, కేటీఆర్ ను అమెరికాకు రావాలని ఇవాంకా ఆహ్వానించారు. ద్వైపాక్షిక చర్చల నిమిత్తం అమెరికాలో పర్యటించాలని ఆమె కోరారు.

అంతకుముందు సంధానకర్త బాధ్యతలు తనకు కొత్తని, తడబాటుకు గురైతే మన్నించాలని కోరిన కేటీఆర్, చివరి వరకూ ఎలాంటి తడబాటు లేకుండా అలవోకగా పని పూర్తి చేశారు. ఇక కేటీఆర్ మాట్లాడుతున్న వేళ ప్యానలిస్టులు కొన్నిసార్లు జోకులు వేయడం గమనార్హం. ప్రతి హైదరాబాదీ ప్రస్తుతం ఐటీ ఐటీ అని కలవరిస్తున్నారని, ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదని, ఇవాంకా ట్రంప్ అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఇవాంకా ఫిదా అయిపోయారు.

More Telugu News