ఇవాంకాకు మోదీ ఇచ్చిన విందుపై.. నిజాం మనవడు నజాఫ్ అలీ ఖాన్ అసంతృప్తి
- విందుకు నన్ను, నా కుటుంబాన్ని ఆహ్వానించలేదు
- గత పది రోజులుగా అధికారులు నా సలహాలు తీసుకున్నారు
- మా సంస్కృతి, సంప్రదాయంలోనే విందు జరిగింది
ఈ విందు కార్యక్రమానికి సంబంధించి నీతి ఆయోగ్ అధికారులు గత పది రోజులుగా తనను సంప్రదించారని, ఇవాంకా కోసం నిజాం గదిని బుక్ చేశారని చెప్పారు. నిజాం పాలకుల విధానంలోనే ఇవాంకాకు స్వాగతం పలికారని, ఆహార పదార్థాలను కూడా అదే తీరులో తయారు చేశారని చెప్పారు. తమ సంస్కృతి, సంప్రదాయంలోనే విందు జరిగిందని... అయినా, తమను మాత్రం ఆహ్వానించలేదని ఆయన వాపోయారు.