వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఫీచర్!

- యూట్యూబ్ వీడియోలు వాట్సాప్‌లోనే చూసుకునే అవకాశం
- చాట్ చేస్తూనే వీడియో వీక్షించే సదుపాయం
- యూట్యూబ్‌లోకి వెళ్లే బాధ తప్పినట్టే
ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఫీచర్ వల్ల వాట్సాప్‌ను వీడకుండానే యూట్యూబ్ వీడియోలను వీక్షించేందుకు అవకాశం యూజర్లకు లభించింది. చాట్ చేస్తూనే అక్కడే ఆ వీడియోను ప్లే చేసి చూసుకోవచ్చు. ఐవోఎస్ వినియోగదారుల కోసమే ఈ ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది.