Ramcharan: యమదొంగ, మగధీర కలసి నటించనున్న చిత్రానికి అభిమానులు సూచిస్తున్న టైటిల్ ఇదే!

  • 'యమధీర' అన్న టైటిల్ పెట్టండి
  • జక్కన్నకు అభిమానుల వినతులు
  • ఎన్టీఆర్ కు జోడీగా అనూ ఇమ్మానుయేల్
  • చరణ్ కు జోడీని వెతుకుతున్న రాజమౌళి!
ఎన్టీఆర్... రాజమౌళి దర్శకత్వంలో ఏకంగా మూడు సూపర్ హిట్ చిత్రాలు చేసిన హీరో. ఇక రామ్ చరణ్ కూడా టాలీవుడ్ కలెక్షన్లను తిరగరాసిన 'మగధీర'తో రాజమౌళి దర్శకత్వంలో నటించాడు. ఇప్పుడిక వీరిద్దరూ కలసి ఆయన దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారన్న విషయం బయటకు పొక్కినప్పటి నుంచి అందుకు సంబంధించిన ఎన్నో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ఈ సినిమాకు 'యమధీర' అన్న టైటిల్ పెట్టాలని అటు మెగా, ఇటు నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో వినతులు పెడుతున్నారు. యమదొంగ చిత్రం నుంచి 'యమ'ను మగధీర చిత్రం నుంచి 'ధీర'ను కలిపి వారు సూచిస్తున్న పేరు బాగానే ఉంది గానీ, దాన్ని జక్కన్న ఎంతవరకూ కన్సిడర్ చేస్తారన్నది మాత్రం ఇప్పటికి సస్పెన్సే. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా అనూ ఇమ్మానుయేల్ ఎంపికైందని, చరణ్ కు జోడీ కోసం వెతుకుతున్నారని కూడా మరో వార్త హల్ చల్ చేస్తోంది.
Ramcharan
NTR
Rajamouli

More Telugu News