Rajamouli: రాజమౌళి న్యూ మూవీలో బాక్సర్లుగా తలపడనున్న ఎన్టీఆర్, రామ్ చరణ్!

  • తొలిసారి కలసి నటించనున్న ఎన్టీఆర్, రామ్ చరణ్
  • ఇప్పటికే శరీరాన్ని పెంచుకునేందుకు వ్యాయామాలు
  • ఫిబ్రవరిలో షూటింగ్ మొదలయ్యే అవకాశం
దర్శకదిగ్గజం రాజమౌళి 'బాహుబలి' తరువాత తెరకెక్కించనున్న మల్టీస్టారర్‌ చిత్రంలో మెగా హీరో రామ్‌ చరణ్‌, నందమూరి హీరో ఎన్టీఆర్‌ హీరోలుగా నటించనున్నారని వచ్చిన వార్తల తరువాత, ఇప్పుడు ఇందుకు సంబంధించిన మరో అప్ డేట్ చక్కర్లు కొడుతోంది. క్రీడా నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, బాక్సర్లుగా నటించే చరణ్‌, తారక్‌ లు చిత్రంలో తలపడతారని సమాచారం.

ఇందుకోసం ఇద్దరూ శరీరాన్ని పెంచుకునేందుకు ఇప్పటికే ప్రత్యేక వ్యాయామాలు చేస్తున్నారని కూడా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తారని కూడా వార్తలు వస్తున్నాయి.
Rajamouli
NTR
Ramcharan

More Telugu News