swathi: నా గురించి తెలియని వాళ్లు పొగరు అనుకుంటారు: స్వాతి

షార్ట్స్‌లో చూడండి
స్వాతి తన సినిమాల విడుదల సమయంలోనే కనిపిస్తుంది .. మళ్లీ సినిమా వరకూ ఎక్కడా కనిపించదు. సినిమా ఫంక్షన్స్ కి ..  ఇతర వేడుకలకి కూడా ఆమె హాజరు కాదు అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటుంది. దాంతో "ఫంక్షన్స్ కి మిమ్మల్ని పిలవరా?  .. మీరు వెళ్లరా?" అనే ప్రశ్న ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో స్వాతికి ఎదురైంది.

 అందుకామె స్పందిస్తూ .. " పిలవకపోవడమంటూ ఏమీ లేదు .. పిలుస్తారండీ. సోషల్ యాంగ్జైటీ కారణంగా నేను వెళ్లక పోవడం జరుగుతూ ఉంటుంది. దాంతో " మాకు తెలుసు మీరు రారని .. " అంటూ పిలవడం మొదలుపెట్టారు. సోషల్ యాంగ్జైటీ అంటే ఏమిటో అర్థమయ్యేవాళ్లకి అర్థమవుతుంది. అర్థంకాని వాళ్లు నాకు పొగరనీ .. లేజీనెస్ అని అనుకుంటారు. నేను ఎవరికీ అందుబాటులో ఉండనని అనుకుంటారు. కానీ నేను ఫంక్షన్స్ కి వెళ్లకపోయినా ఫోన్ లో టచ్ లోనే వుంటాను. వాళ్ల సినిమాలకి వస్తోన్న రెస్పాన్స్ గురించి ఫోన్లో మాట్లాడతాను. ఫంక్షన్స్ కి వెళ్లకపోయినా నా సపోర్ట్ వుంటుందనే విషయం నాతో పరిచయమున్న వాళ్లందరికీ తెలుసు" అంటూ చెప్పుకొచ్చింది.    
Go Back to Shorts
swathi

More Telugu News