maria sharapova: 'మ‌రియా... నన్ను పెళ్లి చేసుకుంటావా?'... ఆట మ‌ధ్య‌లో అడిగిన అభిమాని.. బిత్తరపోయిన టెన్నిస్ రాణి!

  • ష‌ర‌పోవాకు పెళ్లి ప్ర‌పోజ‌ల్
  • 'ఏమో...' అని స‌మాధానం ఇచ్చిన టెన్నిస్ తార‌
  • ప‌గ‌ల‌బ‌డి న‌వ్విన వీక్ష‌కులు

ర‌ష్యన్ టెన్నిస్ క్రీడాకారిణి మ‌రియా ష‌ర‌పోవాకు మ్యాచ్ ఆడుతుండ‌గా ఓ అభిమాని పెళ్లి ప్ర‌పోజ‌ల్ చేశాడు. దానికి ఆమె ఇచ్చిన స‌మాధానం స్టేడియంలో ఉన్న వారందరికీ న‌వ్వులు పూయించింది. ఇస్తాంబుల్‌లోని సినాన్ ఎర్దేం హాల్‌లో ఆమె మ్యాచ్ ఆడుతుండ‌గా ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. అప్పుడే బాల్ స‌ర్వ్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న ష‌ర‌పోవాను 'మ‌రియా... న‌న్ను పెళ్లి చేసుకుంటావా' అని ఓ అభిమాని అడిగాడు.

దానికి ఓ రెండు క్ష‌ణాలు ష‌ర‌పోవా ఆలోచించి...'ఏమో!' అని స‌మాధాన‌మిచ్చింది. దీంతో అక్క‌డ ఉన్న వారంతా ప‌గ‌ల‌బ‌డి న‌వ్వారు. ఇప్పుడు ఆ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

More Telugu News