ivanka trump: ఇవాంకాను అమ‌రావ‌తికి ఆహ్వానించిన చంద్ర‌బాబు... తిర‌స్క‌రించిన అమెరికా అధికారులు!

  • విశాఖ‌లో భారీ వేడుక నిర్వ‌హించాల‌ని యోచించిన ఏపీ సీఎం
  • రాష్ట్ర ఇమేజ్‌ను పెంచే ప్ర‌య‌త్నం
  • గ్లోబ‌ల్ స‌మ్మిట్‌లో మాత్ర‌మే పాల్గొంటుంద‌ని వ్యాఖ్య‌

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, అధ్య‌క్షుడి స‌ల‌హాదారు ఇవాంకా ట్రంప్ ను   ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తికి కూడా ఆహ్వానించాల‌ని ఆ రాష్ట్ర సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్ర‌య‌త్నించిన‌ట్లు తెలుస్తోంది. అయితే భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా, అలాగే షెడ్యూలులో లేని కార‌ణంగా అమెరికా అధికారులు చంద్ర‌బాబు ఆహ్వానాన్ని తిర‌స్క‌రించిన‌ట్లు స‌మాచారం.

రాష్ట్ర అభివృద్ధి కోసం తీవ్రంగా క‌ష్ట‌ప‌డుతున్న చంద్ర‌బాబు నాయుడు, ఇవాంకా ఏపీ ప‌ర్య‌ట‌న‌కు ఒప్పుకుంటే అమ‌రావ‌తిలోగానీ, విశాఖ‌లో గానీ భారీ వేడుక నిర్వ‌హించాల‌ని యోచించార‌ట‌. అలాగే ఇవాంకా రాక‌ కార‌ణంగా తమ రాష్ట్ర ఇమేజ్ పెరిగి, అమెరికా నుంచి పెట్టుబ‌డులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న భావించార‌ట‌. కానీ అమెరికా కాన్సులేట్‌ అధికారులు.... ఆమె గ్లోబ‌ల్ స‌మ్మిట్‌లో మాత్ర‌మే పాల్గొంటుంద‌ని, వేరే వేడుక‌లో పాల్గొన‌బోద‌ని చెప్ప‌డంతో ఆయ‌న అసంతృప్తికి గురైన‌ట్లు ఓ అధికారి తెలిపారు.

More Telugu News