గన్ మెన్లను మరోసారి నిరాకరించిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి!
- ఇప్పటికే మూడుసార్లు గన్ మెన్లను తిప్పి పంపిన కోటంరెడ్డి
- నిన్న మరోసారి గన్ మెన్ల కేటాయింపు, తిరస్కరణ
- ప్రజలే అండ అని పేర్కొన్న ఎమ్మెల్యే
తాజాగా, నిన్న కూడా ఇద్దరు గన్ మెన్లను పోలీసు విభాగం కేటాయించింది. పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్న తరుణంలో భద్రత తప్పనిసరి అంటూ పోలీసులు కోటంరెడ్డికి స్పష్టం చేశారు. అయితే, తనకు ఎలాంటి భద్రత అవసరం లేదని పేర్కొంటూ డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ, జిల్లా ఎస్పీకి ఆయన లేఖలు రాశారు. తనకు పోలీసు భద్రత అవసరం లేదని, ప్రజలే కొండంత అండ అని ఆయన తెలిపారు.