నాలుగేళ్ల కిందట సామూహిక అత్యాచారం.. ఆ వీడియోను ఇప్పుడు బాధితురాలి భర్తకు పంపిన కీచకులు!
- నాలుగేళ్ల కిందట జ్యూస్ లో మత్తుమందిచ్చి సామూహిక అత్యాచారం
- హైదరాబాదుకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్న బాధితురాలు
- వాట్స్ యాప్ ద్వారా భర్తకు వీడియో పంపిన నిందితులు
అప్పటి నుంచి ఆమెను వేధించడం ప్రారంభించారు. కొన్నాళ్లకు ఆమెకు హైదరాబాదుకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. అయినప్పటికీ ఆమెపై వేధింపులు ఆపలేదు. తాజాగా బాధితురాలి భర్తకు వాట్స్ యాప్ ద్వారా ఆ వీడియోను పంపారు. దీంతో ఆయన బాధితురాలిని దూరం పెట్టాడు. దీంతో ఆమె శ్రీనివాసపురం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుల్లో ఒకడైన ఆరిఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. మరొక కీచకుడు తౌసిఫ్ పరారీలో ఉన్నాడు.