హైదరాబాద్‌లో భారీ చోరీ... బంగారం వ్యాపారుల నుంచి రూ.1.26 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు!
- మైసూరు నుంచి బంగారం కొనుగోలుకు వచ్చిన వ్యాపారులు
- ఒక్కసారిగా వ్యాపారులపై దాడి.. నగదు చోరీ
- నారాయణ గూడ పోలీస్ స్టేషన్‌లో బాధితుల ఫిర్యాదు
ఒక్కసారిగా ముగ్గురు వ్యాపారులపై దాడి చేసిన దొంగలు వారి వద్ద ఉన్న రూ.1.26 కోట్ల నగదును అపహరించి పారిపోయారు. దీంతో బాధిత వ్యాపారులు సాంకేత్, స్వప్నిల్, సంగప్ప నగరంలోని నారాయణ గూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.