Narendra Modi: మా పార్టీ నుంచి ఫిరాయించిన వాళ్ల సంగతి చూడండి: మోదీకి మేకపాటి లేఖ

షార్ట్స్‌లో చూడండి
వైకాపా నుంచి విజయం సాధించి తెలుగుదేశం పార్టీలో చేరిన వారి విషయమై, అసంతృప్తిని తెలుపుతూ పార్టీ తరఫున వైఎస్ఆర్ సీపీ పార్లమెంట్ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత పటిష్టం చేయాలని ఈ లేఖలో మేకపాటి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ లేఖను రాస్తూ, పార్టీ మారిన వారిపై అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్ లు చర్యలు తీసుకోకుండా వారిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అటువంటి వారికి మంత్రి పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని మేకపాటి కోరారు.
Go Back to Shorts
Narendra Modi
mekapati
YSRCP

More Telugu News