'మీరే ముఖ్య అతిథిగా పాల్గొనాలి' అంటూ చంద్రబాబును తన స్వగ్రామానికి ఆహ్వానించిన మలయాళ నటుడు సురేష్ గోపీ!
- పలు డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సురేష్ గోపీ
- అమరావతిలో చంద్రబాబుతో భేటీ
- ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు కళ్లియార్ లో జరుగనున్న బనానా ఫెస్టివల్ కి ఆహ్వానం
ఈ అరటి పండుగలో విద్యార్థులు, శాస్త్రవేత్తలు, అరటి రైతులు పాల్గొంటారని, దీనికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని కోరినట్టు చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా ఈ వేడుకకు ఆహ్వానిస్తామని సురేష్ గోపీ తెలిపారు. ఈ వేడుకలో 457 రకాల అరటి ఉత్పత్తులను ప్రదర్శిస్తారని ఆయన పేర్కొన్నారు. కాగా, డబ్బింగ్ సినిమాలతో సురేష్ గోపీ తెలుగు సినీ అభిమానులకు సుపరిచితుడే. ఆయన ధరించిన పోలీస్ పాత్ర ప్రధానంగా నడిచే పలు చిత్రాలు మలయాళం నుంచి తెలుగుకు డబ్బింగయ్యాయి.