team india: 122 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయిన శ్రీలంక

  • టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక
  • అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న కరుణ రత్నె
  • ఫర్వాలేదనిపిస్తున్న చండిమాల్

నాగ్ పూర్ వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య ప్రారంభమైన రెండో టెస్టు తొలిరోజు నిప్పులు చెరిగిన టీమిండియా బౌలర్లను ప్రతిఘటించేందుకు లంక బ్యాట్స్ మన్ తీవ్రంగా శ్రమించారు. లంచ్ విరామ సమయానికి కేవలం 47 పరుగులకు సమరవిక్రమ (13), తిరుమన్నె (9)ల వికెట్లు కోల్పోయిన లంక జట్టును కరుణ రత్నె (51) ఆదుకునే ప్రయత్నం చేశాడు.

సహచరులు వెనుదిరుగుతున్నా పట్టుదల ప్రదర్శించాడు. అయితే అతనిని ఇషాంత్ చక్కని బంతితో పెవిలియన్ పంపాడు. అంతకు ముందు మాధ్యూస్ జాగ్రత్తగా ఆడి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే జడేజా వేసిన బంతి అతని ప్యాడ్లను ముద్దాడడంతో అవుటయ్యాడు. దీంతో 122 పరుగులకు లంక జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇషాంత్ శర్మ రెండు వికెట్లు తీసి ఆకట్టుకోగా, స్పిన్నర్లు అశ్విన్, జడేజాలు చెరొక వికెట్ తీశారు. క్రీజులో చండిమాల్ (39), డిక్ వెల్లా(7) ఉన్నారు. 

More Telugu News