కోస్తా, తెలంగాణలకు వర్ష సూచన!
- 24 గంటల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు
- ప్రభావం చూపుతున్న తూర్పు గాలులు
- తూర్పు బంగాళాఖాతంలోకి ప్రవేశించిన అల్పపీడనం
మరోవైపు అండమాన్ వద్ద సముద్రంలో నెలకొన్న అల్పపీడనం నిన్నటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. ఇది పశ్చిమ నైరుతి దిశగా ప్రయాణించి, 26వ తేదీకి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత దక్షిణ భారతదేశంలోని చివరి ప్రాంతంలో తీరం దాటి, ఆ తర్వాత అరేబియా సముద్రంలో ప్రవేశించి, అక్కడ బలపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.