snake: పాముల‌తో క‌లిసి కాఫీ తాగించే జ‌పాన్ కేఫ్‌... వీడియో చూడండి!

  • యానిమ‌ల్ కేఫ్స్ అనే ఇతివృత్తంతో కేఫ్‌లు
  • జ‌పాన్‌లో వెలుస్తున్న కాఫీ షాపులు
  • పాముల‌ను ప‌ట్టుకుని కాఫీ తాగే అవ‌కాశం

పాముతో క‌లిసి కాఫీ తాగా‌ల‌నుందా? అయితే టోక్యో వెళ్లండి. ఇటీవ‌లే అక్క‌డి హరజుకు ప్రాంతంలో ఓ కేఫ్ వెలిసింది. దాని పేరు టోక్యో స్నేక్ సెంట‌ర్‌. జ‌పాన్‌లో ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్న యానిమ‌ల్ కేఫ్స్ కాన్సెప్ట్ తో ఈ కాఫీ షాపు ఏర్పాటు చేశారు. ఇక్క‌డ పాముల‌తో పాటు వాటికి సంబంధించిన వివ‌రాల‌ను, విశేషాలను కూడా తెలుసుకునే అవ‌కాశం ఉంది. దాదాపు 20కి పైగా విష‌ర‌హిత పాములు ఈ కేఫ్‌లో ఉన్నాయి. కేఫ్‌కి వెళ్లాలంటే 5 పౌండ్లు, పాముల‌ను ప‌ట్టుకోవాలంటే అద‌నంగా 3 పౌండ్లు చెల్లించాల్సి ఉంటుంది.

More Telugu News