pavan: పవన్ చేతుల్లో 'మన అక్కినేని' పుస్తకం!

షార్ట్స్‌లో చూడండి
తెలుగు సినిమా ప్రయాణంలోని ఆణిముత్యాల్లాంటి విషయాలను సేకరించి .. సినిమా ప్రేమికులకు అందించడం కోసం సంజయ్ కిషోర్ ఎంతగానో శ్రమిస్తుంటారు. పాత సినిమాలకి సంబంధించిన అనేక విషయాలను సేకరించడానికి ఆయన ఎంతో ఉత్సాహాన్ని చూపుతుంటారు. అలాంటి సంజయ్ కిశోర్ .. 'మన అక్కినేని' అనే పుస్తకాన్ని రాశారు. వృత్తిపరంగా .. వ్యక్తిగతంగా నాగేశ్వరరావు జీవితానికి సంబంధించిన అనేక విషయాలను సంజయ్ కిశోర్ ఈ పుస్తకంలో ప్రస్తావించారు.

 ఇటీవల 'అజ్ఞాతవాసి' సెట్ కి వెళ్లిన సంజయ్ కిషోర్, పవన్ కి .. త్రివిక్రమ్ కి ఆ పుస్తకాలను అందజేశారు. ఆ పుస్తకాలను పవన్ చేతుల మీదుగా రిలీజ్ చేయించినట్టు కొన్ని వెబ్ సైట్స్ రాయడంతో, సంజయ్ కిషోర్ స్పందించారు. క్రితం నెలలో ఈ పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి చేతుల మీదుగా రిలీజ్ చేయించినట్టు చెప్పారు. ఆ పుస్తకాలను పవన్ .. త్రివిక్రమ్ లకి ప్రత్యేకంగా అందజేశానని స్పష్టం చేశారు.  
Go Back to Shorts
pavan
trivikram
sanjay kishor

More Telugu News