demonitisatin: నోట్ల రద్దు కారణంగా కొత్తగా 56 లక్ష‌ల మంది ఆదాయ‌ప‌న్ను క‌డుతున్నారు: ఉప‌రాష్ట్ర‌ప‌తి

  • కొచ్చిలో ఓ స‌మావేశంలో పాల్గొన్న వెంక‌య్య నాయుడు
  • బ్యాంకుల‌కు డ‌బ్బు తిరిగి వ‌చ్చింద‌ని వ్యాఖ్య‌
  • నోట్ల ర‌ద్దు ల‌క్ష్యం నెర‌వేరింద‌ని ఉవాచ‌

పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేయ‌డం కార‌ణంగా కొత్త‌గా 56 ల‌క్ష‌ల మంది ఆదాయ‌ప‌న్ను క‌ట్ట‌డం మొద‌లుపెట్టార‌ని ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్యనాయుడు అన్నారు. ప‌న్ను రేటు త‌గ్గితే ఇంకా చాలా మంది క‌ట్ట‌డానికి ముందుకు వ‌స్తార‌ని ఆయ‌న పేర్కొన్నారు. కేరళలోని కొచ్చి‌లో జ‌రుగుతున్న కొచ్చిన్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అండ్ ఇండ‌స్ట్రీ స‌మావేశంలో ఆయ‌న పాల్గొన్నారు.

డ‌బ్బు బ్యాంకుల‌కు తిరిగి రావ‌డం మొద‌లైతే బ్యాంకులు వేసే వ‌డ్డీరేటు కూడా త‌గ్గుతుంద‌ని ఆయ‌న చెప్పారు. నోట్ల ర‌ద్దు ల‌క్ష్యం కూడా అదేన‌ని వెంక‌య్య అన్నారు. ఈ సంస్క‌ర‌ణ వ‌ల్ల మూల‌ల్లో దాగున్న డ‌బ్బు కూడా బ‌య‌టికి వ‌చ్చి బ్యాంకుల్లో చేరింద‌ని ఆయ‌న అన్నారు.

More Telugu News