allari naresh: అల్లరి నరేశ్ తో 'సుడిగాడు' సీక్వెల్!

షార్ట్స్‌లో చూడండి
నరేష్ .. రాజేంద్ర ప్రసాద్ తరువాత పూర్తిస్థాయి హాస్య కథానాయకుడిగా వెలుగొందుతోన్న అల్లరి నరేశ్, మినిమమ్ గ్యారెంటీ హీరోగా కొనసాగుతున్నాడు. వినోదాన్ని పంచడంలో తనదైన మార్క్ ను చూపుతూ వస్తోన్న అల్లరి నరేశ్ కి, కొంతకాలంగా సక్సెస్ చిక్కడం లేదు. దాంతో ఆ దిశగా ఆయన తనవంతు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. ఈ ప్రయత్నంలో భాగంగానే ఆయన 'సుడిగాడు' సినిమాకి సీక్వెల్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.

 తమిళంలో విజయాన్ని సాధించిన 'తమిళ పడం' సినిమాకి 'సుడిగాడు' రీమేక్. 'తమిళ పడం' సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రూపొందుతోంది .. త్వరలోనే అక్కడి ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో 'సుడిగాడు' సినిమాను తెరకెక్కించిన భీమనేని శ్రీనివాసరావు, తమిళ సీక్వెల్ కి సంబంధించిన రీమేక్ రైట్స్ ను తీసుకున్నాడట. అల్లరి నరేశ్ తో ఈ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడని అంటున్నారు.       
Go Back to Shorts
allari naresh
bheemaneni srinivas

More Telugu News