'పద్మావతి'కి యూకేలో గ్రీన్ సిగ్నల్.. విడుదల చేయబోమన్న నిర్మాతలు
- డిసెంబర్ 1న విడుదల చేసుకోవచ్చన్న యూకే సెన్సార్ బోర్డ్
- విడుదలకు ఆసక్తి చూపని నిర్మాతలు
- ఇండియాలో క్లియరెన్స్ వచ్చిన తర్వాతే విడుదల అంటూ స్పష్టీకరణ
'పద్మావతి' సినిమాను రూ. 190 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. దీపికా పదుకునే, రణ్ వీర్ సింగ్, షాహిద్ కపూర్ తదితర స్టార్లు ఈ సినిమాలో నటించారు. భన్సాలీ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఇండియాలో వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ చేయనుండగా, అంతర్జాతీయంగా పారామౌంట్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.
ఈ చిత్రంలో పద్మావతిని అగౌరవపరిచే రీతిలో చూపించారనే ఆరోపణలతో రాజ్ పుత్ లు సినిమా విడుదలను అడ్డుకుంటున్నారు. సినిమాపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. వీరికి బీజేపీ నుంచి కూడా మద్దతు ఉంది. బీజేపీ అధికారంలో ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ లలో ఈ సినిమాపై నిషేధం విధించారు.