hyderabad metro rail: మెట్రో రైళ్లలో ప్రయాణికులు తప్పనిసరిగా పాటించాల్సిన అంశాలు ఇవే!

  • మరో ఆరు రోజుల్లో అందుబాటులోకి వస్తున్న మెట్రో రైల్ సేవలు
  • స్టేషన్లు, బోగీల్లో ఏయే పనులు చేయాలి, ఏవి చేయకూడదో జాబితా విడుదల
  • అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయి

హైదరాబాదులో మెట్రో రైలు సర్వీసులు ఈ నెల 28వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు మెట్రో నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ పలు సూచనలు చేసింది. మెట్రో స్టేషన్లలో, రైలు బోగీల్లో ప్రయాణికులు ఏయే పనులు చేయాలి, ఏయే పనులు చేయకూడదో జాబితాను విడుదల చేసింది.

స్టేషన్లు, బోగీల్లో ఏయే పనులు చేయాలి, ఏ జాగ్రత్తలు పాటించాలి?

  • మెట్లు, ఎస్కలేటర్లపై జాగ్రత్తగా వెళ్లాలి
  • ఎస్కలేటర్ పై ఎడమ వైపు మాత్రమే నిలబడాలి
  • ఎస్కలేటర్ దిగిన వెంటనే దానికి దూరంగా వెళ్లాలి
  • ఏదైనా సహాయం కావాలనుకుంటే కస్టమర్ సర్వీస్ లేదా స్టేషన్ సిబ్బందిని సంప్రదించాలి
  • మెట్రో సిబ్బంది, స్టేషన్ స్టాఫ్, తోటి ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి
  • బోగీలో హ్యాండ్ రైల్ ను పట్టుకుని నిలబడాలి
  • చిన్నారులు, వికలాంగులు, సీనియర్ సిటిజెన్స్, మహిళలు సీట్లలో కూర్చునేందుకు సహకరించాలి
  • దిగాల్సిన స్టేషన్ రాగానే రైలు దిగి స్టేషన్ బయటకు వెళ్లిపోవాలి
  • స్టేషన్ లోకి వెళ్లే సమయంలో తనిఖీ సిబ్బందికి, భద్రతా సిబ్బందికి సహకరించాలి
  • నిషిద్ధ వస్తువులు, పేలుడు పదార్థాలను గుర్తిస్తే... వెంటనే మెట్రో సిబ్బందికి తెలియజేయాలి
  • తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో వచ్చే అనౌన్స్ మెంట్లను జాగ్రత్తగా వినాలి
  • రైలు ప్లాట్ ఫామ్ పై నిలిచిన తర్వాతే బోగీలోకి ప్రవేశించాలి
  • ప్రయాణిస్తున్న సమయంలో టోకెన్లు, స్మార్ట్ కార్డులు చూపించాలని మెట్రో సిబ్బంది అడిగితే వారికి సహకరించాలి
  • టికెట్ లేకుండా ప్రయాణిస్తే కఠిన చర్యలు ఉంటాయి
  • టికెట్ కౌంటర్, ఆటోమెటిక్ ఫెయిర్ కలెక్షన్ గేట్ల వద్ద మీ వంతు వచ్చే వరకు క్యూలైన్ లో నిలబడాలి

మెట్రో స్టేషన్లు, రైళ్లలో ప్రయాణికులు చేయకూడని పనులు ఇవే.. కాదని చేస్తే, కఠిన శిక్షలే
https://www.ap7am.com/flash-news-596211-telugu.html

More Telugu News