mca: 'ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్ ఎక్కువ..' అంటూ నాని 'ఎమ్‌సీఏ' టైటిల్ సాంగ్ విడుద‌ల‌!

  • 'వీధి చివ‌ర ఉంటాదో టీ కొట్టు..' అంటూ సాగుతోన్న పాట‌
  • 'మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం..' అంటూ అల‌రిస్తోన్న నాని
  • 'ఎమ్‌సీఏ'కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం

నాని హీరోగా వ‌స్తోన్న 'ఎమ్‌సీఏ' (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. ఈ రోజు ఈ సినిమాలోని టైటిల్ సాంగ్‌ని విడుద‌ల చేశారు. 'వీధి చివ‌ర ఉంటాదో టీ కొట్టు.. ఆడ మేం తాగే టీ ఏమో వ‌న్ బై టూ' అంటూ సాగుతోన్న ఈ సాంగ్ అదుర్స్ అనిపిస్తోంది. ప్ర‌తి చ‌ర‌ణం చివ‌ర 'మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం ఎమ్‌సీఏ' అంటూ సాగుతోంది.

'పాస్‌బుక్‌లో పైస‌ల క‌న్నా ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్ ఎక్కువ' అనే ఈ పాట‌లోని రెండు లైన్ల‌ను నాని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొంటూ ఈ పాట‌ను విడుద‌ల చేశాడు. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వ‌హిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘ఫిదా’ సినిమా హీరోయిన్ సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


More Telugu News