maharashtra: రోడ్డుప‌క్క‌న‌ మూత్ర‌విస‌ర్జ‌న చేస్తూ వీడియోకి చిక్కిన మ‌హారాష్ట్ర మంత్రి

  • ఇంట‌ర్నెట్లో ప్ర‌త్య‌క్ష‌మైన నీటి సంర‌క్ష‌ణ మంత్రి రామ్ షిండే వీడియో
  • అనారోగ్యం కార‌ణంగా చేయాల్సివ‌చ్చింద‌ని సంజాయిషీ
  • స్వ‌చ్ఛ భార‌త్ ఇదేనా... ప్ర‌శ్నిస్తోన్న ప్ర‌తిప‌క్ష ఎన్‌సీపీ

మ‌హారాష్ట్ర జ‌ల సంర‌క్ష‌ణ మంత్రి రామ్ షిండే రోడ్డు ప‌క్క‌న మూత్ర విస‌ర్జ‌న చేస్తూ వీడియోకి చిక్కారు. ఆదివారం రోజు ఈ వీడియో ఇంట‌ర్నెట్లో ప్ర‌త్య‌క్ష‌మైంది. సోలాపూర్ - బార్సి రోడ్డు మీదుగా మంత్రి త‌న కారులో వెళ్తుండ‌గా ఈ ప‌ని చేశారు. దీని గురించి ఆయ‌న‌ను వివ‌ర‌ణ అడ‌గ్గా... గ‌త నెల రోజులుగా జ‌ల‌యుక్త శివార్ ప‌థ‌కం గురించి తీవ్రంగా క‌ష్ట‌ప‌డుతున్న కార‌ణంగా తాను అనారోగ్యం పాల‌య్యాన‌ని, కారులో వెళ్తున్న‌పుడు త‌నకు జ్వ‌రంగా కూడా ఉంద‌ని, ఆ కార‌ణంతో పాటు రోడ్డు మీద టాయ్‌లెట్ క‌నిపించ‌క‌పోవ‌డంతో అక్క‌డే మూత్ర విస‌ర్జ‌న చేయాల్సి వ‌చ్చింద‌ని సంజాయిషీ ఇచ్చారు.

అయితే దీనిపై ప్ర‌తిప‌క్ష ఎన్‌సీపీ మాత్రం తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. హైవే రోడ్ల మీద టాయ్‌లెట్లు లేక‌పోవ‌డం ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ స్వ‌చ్ఛ‌భార‌త్ ప‌నిత‌న‌మ‌ని అవ‌హేళ‌న చేసింది. కేవ‌లం ప‌రిశుభ్రత పేరుతో సెస్సులు, వృథా ఖ‌ర్చులు చేసేందుకు స్వ‌చ్ఛ భార‌త్ కార్య‌క్ర‌మం ఉప‌యోగ‌ప‌డుతోంద‌ని ఎన్‌సీపీ ప్ర‌తినిధి న‌వాబ్ నాయ‌క్ అన్నారు. త‌న పార్టీ మంత్రులే స్వ‌చ్ఛ భార‌త్ భావ‌న‌ల‌ను పాటించ‌న‌పుడు సాధార‌ణ ప్ర‌జ‌లు మాత్రం ఎందుకు పాటించాల‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండ‌గా రామ్ షిండే వీడియోను ఇంట‌ర్నెట్ నుంచి తీసేసిన‌ట్లుగా తెలుస్తోంది.

More Telugu News