Nandi Awards: నంది విజేతలను ఘనంగా సన్మానిద్దామనుకుంటే ఇలా అయిందేంటబ్బా!: ప్రభుత్వ వర్గాల అసంతృప్తి

  • వివాదాలతో రచ్చకెక్కిన అవార్డుల వ్యవహారం
  • కృష్ణా నది పవిత్ర సంగమ ప్రాంతంలో  అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించాలని భావించిన ప్రభుత్వం
  • రచ్చరచ్చకావడంతో అవార్డులనే రద్దు చేయాలన్న యోచనలో ప్రభుత్వం

నంది అవార్డుల విషయంలో తెలుగు సినీ పరిశ్రమ చీలిపోయి విమర్శలు, ప్రతివిమర్శలతో వేడెక్కుతున్న వేళ ఏపీ ప్రభుత్వం తల పట్టుకుంటోంది. తెలుగోడిని ఘనంగా సన్మానిద్దామనుకుంటే ఇలా జరిగిందేట్టబ్బా! అని ఆత్మపరిశీలనకు దిగింది.

నంది అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం తెలుగు వారు గర్వపడేలా విజయవాడలోని కృష్ణా నది పవిత్ర సంగమ ప్రాంతంలో అవార్డుల ప్రదానోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించాలని భావించింది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో పునరాలోచనలో పడినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మూడేళ్ల నంది అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం అవార్డుల బహూకరణ కార్యక్రమాన్ని అత్యంత భారీగా నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచార, పౌరసంబంధాల శాఖ ఉన్నతోద్యోగి ఒకరు చెప్పారు.

అయితే అవార్డులు ఆశించి భంగపడిన వారు లేవనెత్తిన అసంతృప్తి సెగలు పరిశ్రమ మొత్తానికి వ్యాపించి రచ్చరచ్చ కావడం, ప్రభుత్వాన్ని నిందించడంతో కార్యక్రమం మొత్తం పాడైనట్టు ఆయన వివరించారు. ఎంతో వైభవంగా నిర్వహించాలనుకున్న కార్యక్రమం చివరికి అవార్డులను రద్దుచేసే నిర్ణయం వరకు రావడం చాలా బాధాకరమైన విషయమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

More Telugu News