పారితోషికం తగ్గించుకోమన్న దర్శక నిర్మాతలు .. కుదరదన్న అదితీరావు

19-11-2017 Sun 11:30
  • సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ మూవీ
  • అదితీరావుతో సంప్రదింపులు 
  • 50 లక్షలు అడిగిన హీరోయిన్ 
  • మరో హీరోయిన్ కోసం అన్వేషణ    
హిందీ సినిమాలకి ప్రాధాన్యతనిస్తూ వస్తోన్న అదితీరావు, వీలును బట్టి తమిళ .. మలయాళ సినిమాలపై కూడా దృష్టి పెడుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు నుంచి కూడా ఆమెకి ఓ ఛాన్స్ వెళ్లింది. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో కథానాయకుడిగా సుధీర్ బాబును తీసుకున్నారు.

 ఇక హీరోయిన్ గా అదితీరావుతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో చేయడానికి అంగీకరించిన అదితీరావు .. పారితోషికంగా 50 లక్షలు అడిగిందట. ఓ మాదిరి బడ్జెట్ సినిమా కావడంతో అంత ఇచ్చుకోలేమని అన్నారట. అయితే కష్టం అన్నట్టుగా ఆమె మాట్లాడటంతో, మరో హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నారని సమాచారం. వచ్చేనెలలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఎవరికి తగులుతుందో చూడాలి మరి.